![]() |
![]() |

ఎన్నో రోజులుగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న "బ్రో" మూవీ రిలీజ్ అయ్యింది. సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబోలో రిలీజ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ చాలా విషయాలు చెప్పారు. ఈ మూవీలో కేతిక శర్మతో బ్రేకప్ సన్నివేశాన్ని ఎప్పటికీ మరచిపోలేనన్నారు. ఈ సీన్ తన పర్సనల్ లైఫ్ కి బాగా దగ్గరగా ఉంటుందన్నారు. ఇకపోతే ఇప్పుడు "నిఖిల్ తో నాటకాలు" షోలో యూట్యూబర్ నిఖిల్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ ఒక పోడ్ కాస్ట్ చేశారు. అందులో కూడా తన బ్రేకప్ కి సంబంధించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. "2020 లో బ్రేకప్ అయ్యింది. అప్పటినుంచి నేను సింగల్ గానే ఉంటున్నాను.
నాకు నేను తెలుసుకోవడం మొదలుపెట్టా...ఏమన్నా తప్పులు చేసానా అని. ఎవరికైతే నేను నచ్చుతానో వాళ్ళే నా లైఫ్ లోకి వస్తారు. నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఎవరినీ ఫోర్స్ చేసి, అడుక్కునో ఉండమని చెప్పను, వెళ్ళమని కూడా చెప్పను. వాళ్లకు నచ్చినట్టుగా నేను బిహేవ్ చేయడం మానేసాను. మన జనరేషన్ లో ఎక్కడ తప్పు చేస్తున్నాం అంటే మనం పరిస్థితుల వెంట పరిగెడుతూ ఉంటాం. ఇది ఎక్కడో ఒకచోట బోర్ కొడుతోంది. ఒక అమ్మాయిని ప్రేమలో పడేసి ఆ తరువాత ఇక జీవితాంతం పరిగెడుతూ ఉంటాం.
అలా పరిగెత్తి అలిసిపోతాం..బోర్ ఫీలవుతాం. ప్రేమలో పడడం చాలా ఈజీ అనుకుంటారు కానీ అది చాలా కష్టం. ఇక నేను కానీ , వైష్ణవ కానీ ఇంట్లోకి వెళ్ళాం అంటే మూవీస్ గురించి డిస్కషన్స్ ఏమీ చేయము... లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాము, నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను. ఆండ్రాయిడ్ కూడా ఎక్కువగా వాడను..నాకు కోపం వచ్చేది చాలా తక్కువ..ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. కానీ ఒక్కసారి కోపం వస్తే చాలా ఎక్కువగా వస్తుంది. " అని చెప్పాడు సాయి ధరమ్ తేజ్. ఇక ఈ మూవీ ఒరిజినల్‌లో సముద్రఖని నటించడమే కాదు డైరెక్ట్ కూడా చేశారు. తెలుగు వర్షన్ రీమేక్ ని కూడా సముద్రఖని డైరెక్ట్ చేశారు.
![]() |
![]() |